Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

21 సంవత్సరాల పడుచు.. ఆదాయం రూ.7000 కోట్లు!

  • అందాల రాణి కైలీ జెన్నర్ కళ్లు చెదిరే ఆర్జన
  • ప్రపంచంలో అత్యంత పిన్న వయసు బిలియనీర్
  • ఫోర్బ్స్ గుర్తింపు
సామాజిక మాధ్యమాల్లో ఇన్ స్టాగ్రామ్ రారాణులుగా ఎంతోమంది గుర్తింపు తెచ్చుకున్నా, వారందరిలో కైలీ జెన్నర్ ప్రత్యేకమైన సౌందర్యరాశి. ఎంతో స్లిమ్ గా కనిపించే ఈ అందాల అతివ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పిన్నవయసు బిలియనీర్ గా ఫోర్బ్స్ మ్యాగజైన్ గుర్తింపు పొందింది.

ఇన్ స్టాగ్రామ్ లో క్రమం తప్పకుండా ఫ్యాషన్ ఫొటోలు అప్ లోడ్ చేసే కైలీ వయసు 21 సంవత్సరాలు మాత్రమే. ఆ వయసుకు చాలామంది ఇప్పటికీ తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీపైనే ఆధారపడుతుంటారు. అలాంటిది ఈ అమెరికా అమ్మడు ఏకంగా రూ.7000 కోట్ల సంపాదనతో మహామహులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ ఫొటోల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు, టీవీ షోలు, ఫ్యాషన్ ఫొటో షూట్లు, కైలీ బ్రాండ్ తో ఉత్పత్తయ్యే కాస్మెటిక్స్ ఆమె సంపాదనకు ప్రధాన వనరులు.

కైలీ జెన్నర్ ఎవరో కాదు... అమెరికాలో టాప్ సెలబ్రిటీగా పేరు తెచ్చుకున్న కిమ్ కర్దాషియన్ కి కజిన్. టీనేజ్ నుంచి సోషల్ మీడియా సెన్సేషన్ గా గుర్తింపు సంపాదించుకున్న కైలీ జెన్నర్.. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత కైట్లిన్ జెన్నర్, క్రిస్ జెన్నర్ ల ముద్దుల తనయ. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే... కైలీ తండ్రి కైట్లిన్ జెన్నర్ 2015లో ట్రాన్స్ జెండర్ గా మారిపోయాడు. అంతేకాదు, సిక్ట్సీ ప్లస్ ఏజ్ లో కూడా స్విమ్ సూట్ ధరించి మ్యాగజైన్ కవర్ పేజీలపై వేడి పుట్టించడం కైట్లిన్ కే సాధ్యమైంది.
Instagram

More Telugu News